ఓ దేవ వరుణ lyrics

by

Vennu Mallesh

నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కలనలా చంపుకు వెళ్లేనే దయ లేదే అసలు

నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు

ఈ రైతు కి కావాలి కాస్త ఓ పూట కడుపు నిండటం
నువ్వు ఉరుమకుంటే ఎర్రగా క౦దే నిద్దుర లేని కనులు

నా ఊపిరి గాలిలో కలవటానికి ఉండే ఈ మందులు
నా పంటకు వేస్తే పనిచేయలేదే ఈ కల్తీ సరుకులు

ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా
ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా

నా పంట ని పట్టుకు వదల నన్న వి చూడే ఆ క్రిములు
ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు

శ్రావణ మాసమా...
కార్తీక మాసమా...
ఏ మాసంలో వస్తావో చెప్పుట తరమా

తుఫాను వర్షమా...
చినుకుల వర్షమా...
ఏ రూపంలో వస్తావో తెలియదు ఖర్మ

అరే నా బాధే చెప్పినా... నా అప్పులు చూపినా...
ఉలకవా పలుకవా వానా...
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా వర్షమా
మేఘాన్ని మీటు మధురమైన మనవిని వినుమా

ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా
ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా
నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు
ఈ రైతు కి కావాలి కాస్త ఓ పూట కడుపు నిండటం
నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని కనులు

నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని కనులు
నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని కనులు
నువ్వు ఉరుమకుంటే
ఎర్రగకందె
నిద్దుర లేని
కనులు
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z #
Copyright © 2012 - 2021 BeeLyrics.Net